#జీతేగాఇండియా #జీతేంగె హమ్

సోషల్ మీడియా లో ఎప్పుడూ ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్ నడుస్తూనే ఉంటుంది.కొన్ని క్రేజ్ కోసం అయితే కొన్ని సరైన కాజ్ కోసం చేస్తూ ఉంటారు.తాజా గా నటి రవీనా టాండన్ ఒక సామాజిక చైతన్యం కోసం “#జీతేగాఇండియా #జీతేంగెహమ్”అనే క్యాంపెయిన్ స్టార్ చేసారు .కరోనా తో పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్న డాక్టర్‌ లకు అండగా దీనిని మొదలుపెట్టారు. వారిపై జరుగుతున్న అమానవీయ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు.కేవలం దాడులే కాదు వారిపై కొనసాగుతున్న వివక్ష ను కూడా అరికట్టాలని కోరారు.వారిని ఇంటి యజమానులు, అపార్ట్మెంట్ వాసులు అడ్డుకోవడం తగదని వారికి సముచిత గౌరవం, మర్యాద ఇవ్వాలని ,అది మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ సోషల్ మీడియా లో వీడియో ను పోస్ట్ చేశారు.సోషల్ మీడియా పుకార్ల ను కుడా అడ్డుకోవాలని అన్నారు.ఈ కాంపెయిన్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం కూడా డాక్టర్ ల భద్రత కోసం ఆర్డినెన్స్ ను కూడా అమలు లోకి తెచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక నైనా వారి పై దాడులు జరగవని అశిద్దాం.
#జీతేగాఇండియా #జీతేంగె హమ్

Related Articles

Back to top button
Send this to a friend