జనసైనికులు సంయమనం కోల్పోకండి:పవన్

రెండు రోజుల క్రితం కరోనా పై ఎ.పి సి.ఎం జగన్ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి.”కరోనా ఈజ్ నథింగ్ బట్ జ్వరం”అని కరోనా తో కలిసి జీవించాల్సిన రోజులు రావొచ్చని ముఖ్యమంత్రి అనడం సరి కాదని పలువురు విమర్శిస్తున్నారు.నిన్న పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకుల టెలి కాన్ఫరెన్స్ లో కూడా పవన్ దీనిని ఖండించారు.కరోనా చిన్నపాటి జ్వరం కాదని దాని ప్రభావం రోగి ఊపిరితిత్తుల పై తీవ్రంగా ఉంటుందని చైనా లో బయటపడిందని అన్నారు.సమస్య ను పక్కదోవ పట్టించే ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఎవరు చేసినా నమ్మవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.ప్రజల కు జన సేన కార్యకర్తలు అండగా ఉంటూ అవసరాలు తీర్చాలని ,సంయమనం కోల్పోకూడదని సూచించారు పవన్. రాజకీయాలకు తావు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జన సైనికులను కోరారు నాగబాబు.

Related Articles

Back to top button
Send this to a friend