జగన్ టార్గెట్ వేరే ఉందా..?

దేన్నీ తెగేదాకా లాగొద్దు అంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే తెగదు అని తెలిసి కూడా లాగుతున్నట్టుగానే కనిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఎమ్ కాక ముందు అమరావతికి మద్ధతు ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు అంటూ బాంబ్ పేల్చాడు. దీంతో అమరావతి పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే అమరావతి తన మానసపుత్రికగా భావించిన చంద్రబాబు నాయుడు తన అస్త్రాలన్నీ మోహరించి ‘వీ వాంట్ అమరావతి ఓన్లీ’.. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ పాత నినాదాలను కొత్తగా రాయించి తన శ్రేణులన్నిటినీ అక్కడ ఉద్యమానికి నిలబెట్టాడు.
ఇక సేవ్ అమరావతి ఉద్యమం రెండు నెలలకు పైగా నిరాటంకంగా సాగుతోంది. కానీ రిజల్ట్ ఎప్పటికీ కనిపించేలా లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రాంతం తప్ప మరో ప్రాంతమే తనకు తెలియదు అన్నట్టుగా కేవలం అమరావతి కేంద్రంగానే పనిచేస్తున్నారు. కానీ ఇటు జగన్ మాత్రం ప్రతిపక్షం విమర్శలనే కాదు.. డిమాండ్ ను కూడా అస్సలే మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా తన పనేదో తను చేసుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం కొందరు అమరావతి రైతులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. వారు అతని నిర్ణయానికి మద్ధతు ఇస్తాం అని చెప్పారు. అంతే.. ఆ తర్వాత అటు విశాఖపట్నంలో పనులు మొదలయ్యాయి. కర్నూలులో హైకోర్ట్ ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ జై అమరావతి ఉద్యమం మాత్రం ఆగడం లేదు.
ఈ ఉద్యమాన్ని అణచడానికే జగన్ సామూహిక ‘సిట్’ ఏర్పాటు చేశాడని ఎవరికైనా అర్థం అవుతుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవనీతికి సంబంధించి ఈ సిట్ ఎక్కడికైనా వెళ్లొచ్చు. అందుకే సిట్ ఉన్నచోటే పోలీస్ స్టేషన్ అంటూ తేల్చాడు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం మాజీ నాయకుల్లో కొత్త గుబులు మొదలైంది. ఇప్పటికే అచ్చన్నాయుడు కొత్త స్కామ్ లో లింక్ అయ్యాడు. అలాగే ఒక్కొక్కరుగా ఒక్కో అవినీత కేస్ లో లింక్ కాబోతున్నారని జగన్ ఇన్ డైరక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి జగన్ టార్గెట్ కూడా అదే. మాట్లాడుతోన్న మంత్రుల నోరు మూయించాలంటే కేస్ లే కరెక్ట్ అని. మరి ఈ సిట్ వ్యవహారంలో రాబోయే రోజుల్లో మరెన్ని ఆసక్తికరమైన కథలు, కథనాలు వస్తాయో కానీ.. ఓ జైలుపక్షిగా జగన్ ఆ కోణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా తన టార్గెట్ ను రీచ్ అయ్యేలా చేస్తుందా అనేది చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend