జగన్ కు మద్దతు ప్రకటించిన చిరంజీవి

సినిమా ఏక్టర్ చిరంజీవి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించినట్లు కనిపిస్తుంది. ఆయన పాలన వికేంద్రీకరణకు పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు.ఆయన ఒక లేఖను విడుదల చేశారు.ఆ లేఖలో ఆయన అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికై నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఆయన పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే రాజదాని రైతులలో అభద్రత లేకుండా చేయాలని ఆయన అబిప్రాయపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend