జగన్ కు ‘అమరావతి వర్సెస్ స్థానికం’ కానుందా..?


మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న పార్టీలన్నీ అందుకోసం సమాయత్తమవుతున్నాయి. ఎవరికి వారు తమ బలాలు, బలగాలను ఇప్పటి నుంచే నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రధానంగా జగన్ ‘అసలు బలాన్ని’నిరూపించబోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం అతను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులంతా మూడు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ 29 గ్రామాల ప్రజలూ ఉద్యమాల్లోనే ఉన్నారు. అమరావతిని తరలించడానికి వీలు లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకు విస్తరించలేదు కానీ.. చాలా మంది జగన్ నిర్ణయాలను తప్పు బడుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఒక్క కొత్త కంపెనీ రాలేదు. పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా జగన్ ఫెయి్ల అవుతున్నాడు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కు సంబంధించి ఎలాంటి విధి విధానాలూ ప్రకటించలేదు. దీంతో వీటినే స్థానిక అస్త్రాలుగా సంధించబోతోంది తెలుగుదేశం పార్టీ. టిడిపితో పాటు ఇతర పార్టీలదీ అదే దారి. తమకు తిరుగులేని మెజారిటీ ఉంది కాబట్టి వైఎస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలతో పొత్తులు అక్కర్లేదు. కానీ అత్యంత బలహీనంగా ఉన్న మాజీ అధికార పక్ష పార్టీ తెలుగుదేశానికి అవసరం. అందుకే ఇప్పటి నుంచే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారితో పాటు ఎక్కడిక్కడ వారివారి బలాలను బట్టి బిజెపి, జనసేన వంటి పక్షాలతో పొత్తులకు ఎత్తులు వేస్తోంది.
అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సరికొత్త విధానాలు ప్రవేశపెట్టి అటు ఎలక్షన్ కమీషన్ పని కూడా తామే చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే మాత్రం మళ్లీ తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తప్పవు.
ఎలా చూసినా ఈ స్థానిక ఎన్నికలు జగన్ ఇన్ని నెలల పాలనకు గీటురాయి కాబోతున్నాయి. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూనే మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు జగన్ అనే అభిప్రాయం సొంత పార్టీలో కూడా కలగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతగా మారబోతున్నాయి. ఇక్కడ వచ్చే రిజల్ట్ ను బట్టి అమరావతి వర్సెస్ జగన్ అనేది కూడా తేలిపోతుంది. మరి ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో చూడాలి. అన్నట్టు.. రిజల్ట్ ఏదైనా అతను అమరాతిపై నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోడని కొత్తగా చెప్పక్కర్లేదేమో.

Related Articles

Back to top button
Close
Send this to a friend