చైనా కు ప్రత్యామ్నాయం ఇండియా:కె.టి.ఆర్

కరోనా కారణంగా చైనా అంటేనే మిగతా దేశాలకు భయం పట్టుకుంది.చైనాలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు.దీనిని మనం అవకాశం గా మలుచుకోవాలని తెలంగాణా ఐ.టి మంత్రి కె.టి.ఆర్.సూచిస్తున్నారు.చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను మిగతా దేశాలు చూస్తున్నాయని ముఖ్యంగా టెక్నాలజీ ,ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడుల కు భారత్ చాలా అనుకూలమైన దేశం అని అన్నారు. ఆ నమ్మకాన్ని అంతర్జాతీయ స్థాయి లో కలిగించగలిగితే కరోనా సంక్షోభం తర్వాత విదేశీ పెట్టుబడులు భారీ గా రాబట్టవచ్చని  తెలిపారు.కేంద్ర ఐ.టి.శాఖా మంత్రి తో జరిగిన చర్చ లో కె.టి.ఆర్.పలు కీలక సూచనలు చేశారు.జపాన్ తో పాటు మరి కొన్ని దేశాలు చైనా నుండి తమ కంపెనీ లను తరలించే ఆలోచన లో ఉన్నాయని సరైన ప్రణాళిక తో ముందుకు వెళ్తే ఆ కంపెనీ లను మన దేశానికి తీసుకురావచ్చని  సూచించారు.దీని కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రణాళిక లు సిద్ధం చేయాలని కేంద్రాన్ని కోరారు కె.టి.ఆర్.

Related Articles

Back to top button
Send this to a friend