చిరంజీవి ‘ఆచార్య’ను ఆపేస్తున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇంక టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి ఈ ‘ఆచార్య’ను ఆపేస్తున్నారట. అందుకు కారణం కూడా చిరంజీవే అని తెలుస్తోంది.
రీసెంట్ గా ఓ పిట్టకథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి తన సినిమా టైటిల్ ను మాటల్లో జారాడు. అంతకు ముందు రూమర్ గా ఉన్న ఈ చిత్ర టైటిల్ మెగాస్టార్ నోటి వెంటే అఫీసియల్ గా రావడంతో ఇక ఇది ‘ఆచార్య’అని ఫిక్స్ అయ్యారు. అయితే చిరంజీవి ఇలా చెప్పడం కొరటాలకు నచ్చలేదు. అందుకే ఆ టైటిల్ ను మార్చాలనుకుంటున్నారట. ముందుగా గోవింద ఆచార్య అనుకున్న ఆ టైటిల్ చిరంజీవి చెప్పాక ఆచార్య గా మారింది. కానీ ఇప్పుడు అసలు ఈ ఫ్లేవరే లేకుండా మరో కొత్త టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారట. ఏదేమైనా చిరంజీవి నోరు జారడం కొరటాలను బాగా హర్ట్ చేసినట్టుగా ఉంది కదూ.. మరి ఈ సారేం టైటిల్ పెడతారో..

Related Articles

Back to top button
Send this to a friend