చంటిగాడితో లోకల్ డైరెక్టర్


రవితేజ కెరీర్ లో ఊరమాస్ గా ఎన్ని డైలాగ్స్ చెప్పినా.. ఇడియట్ సినిమాలోని ‘సిటీకి ఎంతోమంది కమీషనర్లు వస్తుంటారు పోతుంటారు.. చంటిగాడెప్పుడూ ఇక్కడే లోకల్’ అంటూ చెప్పిన డైలాగ్ కు ఉండే క్రేజ్ వేరు. ఆ డైలాగ్ తో నాటి యూత్ ను మెస్మరైజ్ చేశాడీ మాస్ రాజా. ఇడియట్ తర్వాతే అతని దశ తిరిగిందని కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కెరీర్ లో ఒక రకంగా చివరిదశ అని ‘మరోసారి’ అనిపించుకుంటోన్న రవితేజ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగానే అతని పనైపోయిందనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే సినిమాలు పోతున్నా.. కొత్త సినిమాలు ఆగడం లేదు. కాకపోతే రెమ్యూనరేషన్ కాస్త తగ్గింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ అనే సినిమా చేస్తోన్న రవితేజ ఈ మూవీతో మే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
క్రాక్ తర్వాత మరో కొత్త సినిమా ఫైనల్ చేసుకున్నాడు రవితేజ. నేచురల్ ఇమేజ్ ఉన్న నానితో ‘నేను లోకల్’ అంటూ మాస్ హిట్ అందించిన త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రవితేజ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. కొన్నాళ్ల క్రితమే ఈ వార్తలు వచ్చినా.. లేటెస్ట్ గా ఫైనల్ అయిపోయాయి. సాధారణమైన కథలకే తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తూ కమర్షియల్ విజయాలు అందుకోవడం త్రినాథరావు స్టైల్. ఇక మాస్ రాజా వంటి హీరోతో అయితే చెప్పేదేముందీ.. సో ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఆకట్టుకోవచ్చేమో.

Related Articles

Back to top button
Close
Send this to a friend