కొత్త ఫోన్ కొంటున్నారా.. ఈ షాక్ మీకే

    Written By: Last Updated:


సెల్ ఫోన్.. ఇది లేని వారిని ఊహించలేం ఇప్పుడు. ఒకప్పుడు సాధారణ ఫోన్ ఉంటేనే గొప్ప. కానీ ఇప్పుడు. ఏ ఫోనూ వాడకపోతే గొప్ప అన్నట్టుగా మారింది. ఇక స్మార్ట్ ఫోన్ యుగంలో ఇది ఒక వ్యసనంగా మారింది. హైస్కూలో పోరల కాన్నుంచి హై క్లాస్ బిజినెస్ పీపుల్ వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే కాలం గడవదు అన్నట్టుగా మారింది పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. నెట్టింట కాలు పెట్టి రకరకాల ఆనందాలు ఆస్వాదిస్తున్నారు. మొత్తంగా రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లోకి దిగుమతి అవుతుంది. అందులో సరికొత్త ఫీచర్స్ ఊరిస్తుంటాయి. దీంతో వాడుతున్న ఫోన్ బానే ఉన్నా.. ఆ కొత్త ఫీచర్ కోసం కొత్త ఫోన్ నే కొనేస్తున్నారు కొందరు. అలాంటి వారితో పాటు సరికొత్తగా ఫోన్ కొనాలనుకుంటున్నవారికి మన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త షాక్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్ పై 12శాతం జిఎస్టీ విధించారు. తాజాగా కొత్త ఫోన్ కొంటే 18శాతం జిఎస్టీ విదిస్తూ కొత్త నిబంధన తెచ్చారు. దీనివల్ల సెల్ ఫోన్ రేట్లు పెరుగుతాయి. అయితే ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. అదీ మేటర్ .. ఇకపై సెల్ ఫోన్ ఖరీదు కంటే దానికి కట్టే జీఎస్టీనే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఏంటో ఈ కాలం.