కొంటె కుర్రాడు లోగో, టైటిల్ పోస్టర్ విడుదల

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్,బ్యానర్ లో మాస్ మహారాజ రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తు నిర్మిస్తున్న చిత్రం “కొంటె కుర్రాడు” (ఓ లోఫర్ గాడి ప్రేమ కథ) అనేది ఉపశీర్షిక. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో ట్రయాంగిల్ మాస్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది, బ్యానర్ లోగో, టైటిల్ పోస్టర్ లోగోని హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు కొంటె కుర్రాడు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఎమ్.ఎన్.వి.సాగర్ మాట్లాడుతూ…
. మాస్ మహారాజ రవితేజను ఆదర్శనంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. నా ఒక్కడితో మొదలైన ఈ సినిమాలో ఎనభై శాతం మాస్ మహా రాజా డై హార్డ్ ఫ్యాన్స్ వర్క్ చేస్తున్నారు. ఆయన అభిమానిగా నేను చేస్తున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది, క్లైమాక్స్ ఊహాలకి అందని ట్విస్టులతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఆర్టిఎఫ్స్ అందరూ కూడ తమ సొంత సినిమాల భావించి సపోర్ట్ చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

ఈ సినిమా లో అన్ని పాటలు కధకనుగుణంగా మంచి ట్యూన్స్ కుదిరాయి.మాస్ మహా రాజా సినిమా టైటిల్స్ తో విడుదల చేసిన తొలి పాటకి యూట్యూబ్ లో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తో నాకు మంచి పేరు వస్తుంది అని సంగీత దర్శకుడు అరమాన్ మెరుగు అన్నారు.
రవితేజ గారి వీరాభిమాని ని అయిన నాకు సాగర్ అన్న తెరకెక్కిస్తున్నా కొంటె కుర్రాడు సినిమా లో భాగం అయ్యే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
అద్భుతమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని డిఓపి.
సి ఎస్ చంద్ర అన్నారు.
ఈ చిత్రానికి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎమ్ ఎన్ వి సాగర్.
డి ఓ పి: సిఎస్ చంద్ర
ఎడిటింగ్: మహేష్
సంగీతం: అరమాన్ మెరుగు
విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు సప్ప
పోస్టర్ డిజైనింగ్: కిషోర్ బాబు
లిరిక్స్: పృథ్వి. బాల&లింగేశ్వర్.సి ఎచ్చ్ వెంకట్రావు
కొరియోగ్రాపి: ఈశు ఈశ్వర్
కో.ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్
మేనేజర్: టి వినయ్
క్యాస్టింగ్: సాయి ప్రసాద్
పి ఆర్ ఓ: సాయి సతీష్
ట్రెండీ టోలి టీమ్: తనయ్&దిలీప్ లెక్కల.

Related Articles

Back to top button