`కేరాఫ్ కంచ‌రపాలెం` ద‌ర్శ‌కుడు కొత్త చిత్రం `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపశ్య‌`

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు వెంట‌నే మ‌రో సినిమానో నిర్మించ‌కుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ స‌క్సెస్, బ్రోచెవారెవ‌రురా సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టుడు స‌త్య‌దేవ్ కంచ‌ర‌న ఇందులో హీరోగా న‌టిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button