కెటీఆర్.. రేవంత్ కు భయపడుతున్నాడా..?
తెలంగాణ రాజకీయాల్లో కనిపించని వేడి రాజుకుంది. ఒకరికపై ఒకరు పై చేయి సాధించేందుకు.. చేసిన ప్రయత్నాల్లో సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికి వారం రోజులు దాటినా అతనికి బెయిల్ రాలేదు. తాజాగా బెయిల్ కోసం రేవంత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను కూడా కోర్ట్ కొట్టివేసింది. అయితే కొన్ని రోజుల క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ కెటీఆర్ కు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ లున్నాయని నిరూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ ఫామ్ హౌస్ ప్రాంతంలో ధర్నా చేసింది. ఈ ఫామ్ హౌస్ కెటీఆర్ దే అని చెబుతూ కొన్ని ఫోటోస్ కూడా విడుదల చేసింది. అయితే ఆ ధర్నాలో సాధారణ అరెస్ట్ ల తర్వాత ఎప్.పి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
రేవంత్ అరెస్ట్ కు కారణాలేంటీ అంటే అతను కెటీఆర్ ఫామ్ హౌస్ పై పర్మిషన్ లేకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాడనేది ఆరోపణ. అక్కడి వరకూ తప్పే కానీ.. ఇప్పటి వరకూ కెటీఆర్ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అంటూ గట్టిగా చెప్పలేకపోతున్నాడు. తనకు అక్రమ ఆస్తులు లేవు అని ఢంకా భజాయించే ఈ చినరాజా వారు ఆ ఫామ్ హౌస్ విషయంలో కామ్ గా ఉండిపోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వస్తే మళ్లీ అదే కక్షతో ఆ ఫామ్ హౌస్ పైనే పడతాడు. దాన్ని నిరూపించుకునేందుకు ఎంతకైనా వెళతాడు. ఆ భయం కొద్దీ కూడా రేవంత్ కు బెయిల్ రాకుండా చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఆరోపణ.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నుంచి ప్రధాన నాయకులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఈ విషయంపై స్పందిస్తే అనవసరంగా రేవంత్ ను హీరోను చేసినట్టు అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుల భావన. అందుకే కొందరు మాత్రమే బెయిల్ నిరాకరణపై విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇది రేవంత్ వర్సెస్ కెటీఆర్ అనేలా పర్సనల్ గానూ కనిపిస్తోంది. అయినా డ్రోన్ కెమెరాతో ఫామ్ హౌస్ చిత్రీకరిస్తేనే ఇలా నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేస్తారా..? అది అంత పెద్ద మేటర్ కానప్పుడు కెటీఆర్ మాత్రం ఎందుకు స్పందించడం లేదో వారికే తెలియాలి.