కరోనా రాజకీయం…!

ప్రపంచం అంతా కరోనా కట్టడి కి తీవ్రంగా కృషి చేస్తుంటే ఏపీ లో మాత్రం కరోనా రాజకీయ దుమారం రేపుతుంది.ప్రతిపక్ష అధికార పక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి మాత్రం తెరపడటం లేదు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేగవంతం గా, సమర్ధవతంగా లేవని ,ఇలా అయితే కరోనా కట్టడి చెయ్యడం ఇప్పట్లో సాధ్యం కాదని టీడీపీ విమర్శిస్తోంది.అంతే కాకుండా పాజిటివ్ కేస్ ల సంఖ్య విషయం లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందని టీడీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ విమర్శలను అధికార పక్ష నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతునే ఉన్నారు..వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా టీడీపీ కి ఘటు గానే కౌంటర్ వేస్తున్నారు…
మరో సారి తాజాగా చంద్రబాబు పై తన ట్వీట్ లో విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి..చంద్రబాబు నిజాయితీ లేని నాయకుడు అని,తను ఇపుడు ముఖ్యమంత్రి పదవి లో ఉండి ఉంటే కరోనా ను కూడా తన ప్రచారానికి వాడుకునే వాడని ఏద్దేవా చేశారు.

పాజిటివ్ రోగులను దచాల్సిన అవసరం తమ ప్రభుత్వం కి ఎం ఉంటుందని ప్రశ్నించారు..జగన్ స్థానం లో చంద్రబాబు ఉంటే కేస్ లను వేలల్లో చూపి,ప్రాణ నష్టం లేకుండా చేశానని డప్పు కొట్టుకునే వాడని దుయ్యబట్టారు….

అయినా లాక్ డౌన్ లో ప్రశాంతం గా మనవడి తో ఆడుకొక మధ్యలో ఈ చిటిక లు ఎందుకు అని ట్వీట్ లో ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి…

అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేసి రాష్ట్రానికి మేలు చేయాలి కానీ ఈ కష్ట కాలం లో కూడా రాజకీయ విమర్శలు ఎంటి అని ఏపీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు….

Related Articles

Back to top button
Send this to a friend