కమల్ హాసన్ కంప్లైంట్ మరీ సీరియస్ గా ఉందా..?

తనను తమిళనాడు పోలీస్ లు వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ లో పిటిషన్ వేశాడు కమల్ హాసన్. ఈ వార్త విన్నవాళ్లంతా విస్తుపోతున్నారు. సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు.. అయిన కమల్ హాసన్ ఇలా పోలీస్ లు ఇబ్బంది పెడుతున్నారని కేస్ వేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ విషయంలో ఆయన పేర్కొన్న కొన్ని అంశాలు ఇబ్బందికరమే అయినా ఇంత ఇది తీసుకోవడానికి కారణం ఏంటా అనుకుంటున్నారు.
రీసెంట్ గా భారతీయుడు -2 సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ముగ్గురు మరణించారు. ఈ విషయంలో బాధిత కుటుంబాల వాళ్లెవరూ యూనిప్ పై పోలీస్ కంప్లైంట్ చేయలేదు. అయినా పోలీస్ లు కేస్ నమోదు చేశారు. దర్శక నిర్మాతలతో పాటు హీరోపైనా కేస్ బుక్ చేశారు.ఈ కేస్ విషయమై ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా హాజరు కావాలని విచారణ కూడా చేశారు. ఇదే టైమ్ లో నిర్మాణ సంస్థకు, కమల్ కు మధ్య కూడా ఆ ప్రమాదం విషయమై కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమల్ ఏకంగా పోలీస్ లపైనే కేస్ వేయడంతో అసలు ఏం జరుగుతుందా అని చిత్ర పరిశ్రమ కూడా ఆరాలు తీస్తోంది. మరి ఈ కేస్ పై మద్రాస్ హై కోర్ట్ ఏం చెబుతుందో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend