కన్నీరు పెట్టిస్తున్న ఇర్ఫాన్ లేఖ

తన శరీరంలో కాన్సర్ క్రిమి ఉంది అని తెలిసిన తర్వాత ఇర్ఫాన్2018 లో అభిమానులకు లేఖ రాశారు. కానీ తను ఆరోగ్యం గా తిరిగి కోలుకుంటాడని అందరూ ఆశించారు.అకస్మాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్ళి పోయారు.ఇప్పుడు ఆ లెటర్ తలచుకుని అందరూ విషాదం లో మునిగి పోయారు.మొదట రోగం గురించి తెలిసినపుడు అది నన్ను కుంగదీయకూడదని,నేను పిరికివాడిలా మారకూడదని రకరకాలుగా ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను కానీ నెేను పోరాటంలో అలసిపోయాను,నిస్పృహ లోకి వెళ్లి పోతున్నాను అని రాశారు.ఆస్పత్రి లో ఉన్న సమయంలో తన లో కలవరం రేపిన అనేక ఆలోచనలను ఆ లెటర్ ద్వారా పంచుకున్నారు ఇర్ఫాన్.ప్రస్తుతం కల్లోలంలో ఉన్న సముద్ర ప్రవాహంలో నేెనొక బెండు ముక్క లా కొట్టుకుపోతున్నాను.ఈ ప్రవాహాన్ని నేను నియంత్రించలేకున్నా, ప్రకృతి ఒడి లో సేద తీరాలని ఉంది అని ఆ లేఖ లో భావోద్వేగం తో రాశారు.నా కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు.నాలో కొత్త శక్తి మొదలవుతుందని అనిపిస్తుంది అని రాశారు.కానీ చివరికి ఏ శక్తీ ఇర్ఫాన్ ను కాపాడలేకపోయింది.తాను కోరుకున్నట్లుగానే మౌనంగా ప్రకృతి లో ఒదిగిపోయి అందరినీ శోకసంద్రం లో ముంచేశారు.

Related Articles

Back to top button
Send this to a friend