ఓయమ్మో విలన్ గా చేస్తుందటగా

ఒకప్పుడు టాప్ హీరోల సరసన టాప్ హీరోయిన్ గా వెలిగిన బ్యూటీ భూమిక. ఖుషీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ భామ కొంతకాలం పాటు టాలీవుడ్ ను ఏలేసిందనే చెప్పాలి.మినీ స్టార్ నుంచి మెగాస్టార్ వరకూ అమ్మడితో రొమాన్స్ చేశారు. అయితే కెరీర్ ఫర్వాలేదు బానే ఉంది అనుకుంటోన్న టైమ్ లోనే సడెన్ గా తను ప్రేమించిన భరత్ ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ చాలామంది హీరోయిన్లలాగానే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విడాకులు తీసుకోలేదు కానీ విడిగానే ఉంటున్నారిద్దరూ. పైగా తనకు ఓ బాబు. ఈ టైమ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది భూమిక. రీసెంట్ గా కొన్ని సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటోంది. అయితే త్వరలోనే తను ఓ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా చెప్పింది.
ప్రస్తుతం భూమిక చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. వీటిలో ఓ సినిమాలో పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేస్తోందట. సినిమా అంతా తన పాత్ర అలాగే ఉంటుందని తనే చెబుతోంది. అయితే ఆ సినిమా ఏంటనేది మాత్రం రివీల్ చేయడం లేదు. ఇంతకు ముందు మిస్సమ్మ సినిమాలో కాస్త ఈ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేసింది. బట్ అది మరీ విలనీ అనేంతటి క్యారెక్టర్ కాదు. మొత్తంగా ఈ వెటరన్ బ్యూటీకి కాస్త కొత్త పాత్ర వచ్చింది. మరి నిన్నటి వరకూ కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ అయిన భూమిక ఒక్కసారిగా ఇలనీ సేత్తే సూత్తారా..?

Related Articles

Back to top button
Send this to a friend