ఒక్క షాట్ కోసం రెండు కోట్లా ప్రభాస్ ..?

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా విషయలో రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇంతకు ముందెప్పుడూ లేనంతగా ఏకంగా యూరప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కొన్ని సెట్స్ వేశారు. సినిమా ఆ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.పైగా 1960ల నేపథ్యం. అయితే సాహో ఇచ్చి రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కోతలో భాగంగా యూరప్ లో చేయాల్సిన షూటింగ్ ను ఇక్కడే సెట్స్ వేసి చేస్తున్నారు. అందుకోసమే అనేక సెట్స్ వేశారు.
అయితే లేటెస్ట్ గా ఈ మూవీలో ఒకే ఒక్క షాట్ కోసం ఏకంగా రెండు కోట్లతో ఓ సెట్ వేశారట. ఈ షాట్ మరీ అంత ప్రాధాన్యమైనది కూడా కాదని వినిపిస్తోంది. కాకపోతే ఆ వాతారవణం చూపించాలి కాబట్టే ఈ షాట్ కోసం అంత ఖర్చు తప్పలేదు అంటున్నారు. ఇది ఓ ఛేజ్ సీన్ లో భాగంగా కనిపించే షాట్ అంటున్నారు. అందుకోసం ఓ మార్కెట్ ను క్రియేట్ చేశారట.
నిజానికి మొదట్లో ఈ చిత్రాన్ని పూర్తిగా లవ్ స్టోరీ అన్నారు. యాక్షన్ సీన్స్ ఉండవని చెప్పారు.కానీ సాహో తర్వాత చేసిన భారీ మార్పుల్లో భాగంగానూ తర్వాత హిందీ మార్కెట్ ను అట్రాక్ట్ చేయడం కోసం గానూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కలిపారుట.
ఈ ఉగాదికి సినిమా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే సినిమాను అక్టోబర్ 16న దసరా బరిలో విడుదల చేయబోతున్నారట.
రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
ఏదేమైనా ఇప్పుడు ఒక్క షాట్ కోసం రెండు కోట్లు అనే మాట విని టాలీవుడ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు.