కోట్ల పిడికిల్లు బిగుసుకున్నాయి:కె.టి.ఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగి నేటికి 20 వసంతాలు పూర్తి అయింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసమై టి.ఆర్.యస్. ను స్థాపించారు కె.సి.ఆర్.ఆయన ఊపిరులూదిన ఉద్యమం యువతను సైతం మేల్కొల్పి తెలంగాణ కల సాకారమయ్యేలా పోరు సలిపేలా చేసింది.20 వ ఆవిర్భావ దినోత్సవాలు అత్యంత భారీ గా నిర్వహించాలి అనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా నేడు సాదాసీదా గానే చేసుకోవాల్సిన పరిస్థితి.సామాజిక దూరాన్ని పాటిస్తూ అన్ని జిల్లా కార్యాలయాలలో పార్టీ జెండా ను ఎగురవేయాలని శ్రేణులకు సూచించారు నేతలు.ఇక ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు కె.టి.ఆర్.
ఒక్క పిడికిలి బిగిస్తే కోట్ల పిడికిల్లు బిగుసుకున్నాయి
ఒక్క గొంతు జై కొడితే జంగు సైరనయింది.
స్పూర్తి ప్రదాతా వందనం ఉద్యమ సూర్యుడా వందనం

జై తెలంగాణ జై కె సి ఆర్ అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button
Send this to a friend