ఒక్క ట్వీట్ తో తక్షణ సహాయం..KTR

తెలంగాణ ఐ.టి మరియు పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్. ప్రస్తుతం పిలిస్తే పలికే దేవుడి లా కనిపిస్తున్నారు చాలా మందికి. దానికి కారణం ప్రభుత్వ పరంగా అందించే సేవలు అందిస్తూనే తన ట్విట్టర్ ద్వారా నిరంతరం అందుబాటులో ఉండటమే.రక్తం కావాలన్నా,వైద్య సేవలు అందించాలని అడిగినా,ఆర్ధిక సాయం కోరినా అడిగినదే తడవుగా అండగా నిలుస్తున్నారు. ఫలానా సమస్య ఉంది అని తనకు ట్వీట్ అందిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు.ప్రతి ఒక్కరి ట్వీట్ కు స్వయంగా రిప్లై ఇచ్చి వారికి నేను ఉన్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. సమస్య లో ఉన్న వారు ఏ రాష్ట్రం లో ఉన్నా సరే అక్కడి అధికారుల తో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.కె.టి.ఆర్ ట్విట్టర్ చూస్తే ఇందంతా మీకే అర్థమవుతుంది. కష్ట కాలంలో ఒక అన్న లా అండగా నిలబడిన కె.టి.ఆర్ మంచి మనసు ను ,ఆయన పనితనాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Related Articles

Back to top button