ఏపీ సీఎం కి కృతజ్ఞతలు తెలిపిన TTPC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా , టెలివిజన్ షూటింగ్ లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడం తో పాటు షూటింగ్ లకు ఉచితంగా లోకేషన్స్ ఇస్తునందుకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హైదరాబాద్ మన స్టూడియో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఏపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి APFDC చైర్మన్ శ్రీ విజయ్ చందర్ గారికి APFDC ఎండీ శ్రీ.విజయ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యాదములు తెలియజేసింది.

తెలుగు టెలివిజన్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద్ రావు మాట్లాడుతూ…హైదరాబాదు లో పరిశ్రమ ఉన్నా , కనీసం రెండు షెడ్యూల్స్ ఎపిలో అందమైన లోకెషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నాము అన్నారు..కానీ ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతులు కాస్త కష్టంగా ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక, విజయ్ చందర్ గారి సహకారంతో ,మా టీవీ ఇండస్ట్రీ కి ఉపయోగపడే జీవొ ను ఇచ్చారని తెలిపారు . అన్నీ ప్రభుత్వ ప్రదేశాలలో ఉచితంగా చిత్రీకరణ చేసుకునే అవకాశం ఇవ్వడం తో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చిన జగన్ గారికి మా కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

నిర్మాత డివై చౌదరి మాట్లాడుతూ..ఏపి ప్రభుత్వం కు ధన్యవాదాలు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఉచితంగా లోకేషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చెస్తున్నామన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ప్రసాద రావు గారు మరియు Dy.చౌదరి, S.సర్వేశ్వర రెడ్డి , యాట సత్యనారాయణ, గుత్త వేంకటేశ్వర రావు, అశోక్ నలజాల మరియు టీవీ పేటర్నిటి శ్రీ రాందాస్ నాయుడు గార్లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami