ఏటిదీ.. పవన్ సినిమానా..?

Is this Pawan's Movie?


మామ మానుకున్నాడు.. అల్లుడు పూనుకున్నాడు.. అన్నట్టుగా ఉంది లేటెస్ట్ గా ప్రారంభం అయిన ఓ సినిమా కథ. లేటెస్ట్ గా సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. పొలిటికల్ సెటైర్స్ ఉన్న కథతో సాగే సినిమాట ఇది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్ర ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. మామూలుగా అయితే పవన్ కు మేనల్లుడు సాయితేజ్ అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చాడు అనుకున్నారు. కానీ దాంతో పాటు మరో సీక్రెట్ కూడా ఉంది.
ఈ కథను అసలు పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేశాడట దర్శకుడు దేవా కట్టా. ఇంతకు ముందే చెప్పాడట కూడా. అయితే అప్పుడు పవన్ ఓకే చెప్పాడు. మరి ఏమైందో.. ఈ సినిమా నుంచి తను మానుకున్నాడు. కానీ దేవా కట్టకు ఇచ్చిన మాట మేరకు తనే హీరోతో పాటు నిర్మాతను కూడా చూసి పెట్టాడట. అందుకే అసలు సినిమాలే లేని దేవా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అదే కథలో కొన్ని మార్పులు చేసి అల్లుడుతో లాగించేందుకు రెడీ అయ్యాడు. మామూలుగా ప్రస్థానం సినిమాలో దేవా కట్టా పొలిటిక్స్ ను ఎలా చూపించాడో అందరికీ తెలుసు. ఇది కూడా కాంటెంపరరీ కథతో రాసుకున్న కథేనట. అంటే ఈ సారి మరింత ఘాటుగా ఉంటుంది.. ఒకవేళ ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఎలా ఉండేదో.. ?

Related Articles

Back to top button
Send this to a friend