థ్రిల్లర్ “A” సినిమా టైటిల్ పోస్టర్ విడుదల


అవంతిక ప్రొడక్షన్స్ “A” (AD-INFINITUM) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నితిన్ ప్రసన్న ; ప్రీతీ అశ్రాని ( మళ్లీరావా ; ప్రెసర్ కుక్కర్ );బేబీ దీవెన (జబర్దస్త్); రంగాథం; కృష్ణవేణి; భరద్వాజ్ ఈ చిత్రం లో ముఖ్య పాత్రల్లో నటించారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు . ఆయన మాట్లాడుతూ

ఈ సినిమా కథాంశం చాలా అనుహ్యమైనది , ఇప్పటివరకు ప్రపంచ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైనటువంటి కథ, 1977 నుండి 2019 మధ్య ఈ కథ నడుస్తుంది అన్నారు . దర్శకునితో సహా మిగిలిన టెక్నిషన్స్ అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లు కావటం తో సినిమా టెక్నికల్ గా అద్భుతంగా వచ్చిందని తన ఆనందం వ్యక్తపరిచారు. నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో 300 కి పైగా ఆడిషన్స్ చేసినట్లు తెలిపారు. ఖచ్చితంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు ఒక క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తి ని ఇస్తుంది. మేకింగ్ విషయం లో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా శంషాబాద్ దగ్గర్లో ఒక సెట్ ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించటం జరిగిందని తెలిపారు.

Related Articles

Back to top button
Send this to a friend