ఉరుకులు పరుగులే జీవితం కాదు:విద్యాబాలన్

బిజీగా ఉండటం అలవాటు అయిన వారికి ఖాళీగా ఉండటం కష్టమే కానీ ఇప్పుడు తప్పదు కదా అందుకే అలవాటు చేసుకున్నా అంటోంది బాలీవుడ్ నటి విద్యాబాలన్.మొదట్లో లాక్ డౌన్ అనగానేె కాస్త భయపడిందట కానీ ఇప్పుడు తనకి టైమే తెలియడం లేదట.తీరిక లేకుండా సినిమాలు చేసే టైం లో చెయ్యాలని ఉన్నా ఇంటి పనులు చెయ్యలేము.కానీ ఇప్పుడు చేసుకోక తప్పడం లేదు కదా అందుకే విద్యా కూడా పగలు వ్యాయామం తో మొదలుపెట్టి ఇంటి పనులు తో పాటు,గార్డెనింగ్ కూడా చేస్తుందట.టీవీ చూడటం,పుస్తకాలు చదవడం,డైరీ రాయడం చేస్తుంటే టైమే తెలియడం లేదు అంటోంది ఈ కధానాయకి.ఒకప్పుడు వంట చేయడం అనే పనిని వ్యతిరేకించిన విద్య ఇప్పుడు మనసు మార్చుకుని కొన్ని వంటలు నేర్చుకుంటోందట.కాలం అందరినీ మారుస్తుంది అంటే ఇదే.లాక్ డౌన్ చాలా నేర్పిందని ఉరుకులు పరుగులే జీవితం కాదని ఉన్న చోట ఉండి కూడా చాలా నేర్చుకోవచ్చని తెలుసుకున్నా అంటోంది.తన వంతుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తోంది.డాక్టర్ లకు అవసరమైన పి.పి.ఇ కిట్ల ను డినేట్ చేస్తోంది.దాతలు కూడా తనతో కలిసి వస్తే మరింతగా సేవ చేద్దాం పిలుపునిస్తోంది విద్యా బాలన్.

Related Articles

Back to top button
Send this to a friend