ఈ సారి కూడా బిజినెస్ మాన్ మహేష్ ఏనా??

పూరి జగన్నాథ్ బిజినెస్ మాన్ 2 చేస్తున్నారా? పూరి 20వ సినిమా బిజినెస్ మాన్2 ఏనా..తమన్ చేసిన తాజా ట్వీట్ చూస్తే నిజమే నేమో అనిపిస్తుంది.కొద్ది రేపటి క్రితం పూరి జగన్నాథ్ 20ఏళ్ళ సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విష్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు.ఈ ప్రయాణం లో తాను కూడా భాగం అవడం సంతోషం అంటూ ట్వీట్ లో రాసారు.పూరి జగన్నాథ్ తీసిన బిజినెస్ మాన్ సినిమా కి మ్యూజిక్ అందించింది తమనే.మీరు బిజినెస్ మాన్2 చెయ్యడానికి రెడీ అవుతున్నారని నాకు తెలుసు,ఇద్దరం కలసి త్వరగా మళ్ళీ సినిమా చేద్దాం సర్ అని తమన్ అన్నాడు.. అంటే ఈ సినిమా కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూరి మొదలు పెట్టారా?మరి ఈ సినిమా లో కూడా మహేష్ నే హీరో గా తీసుకుంటాడా ??ఒకవేళ ఇది నిజమైతే ఇద్దరి కలయిక లో ఇది హాట్రిక్ సినిమా అవుతుంది.ఇది తమన్ కే కాదు మహేష్ అభిమానులకు కూడా పండగే కదా..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినట్లే బిజినెస్ మాన్2 కూడా రికార్డులు బద్దలు కొడుతుందో లేదో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend