పోలీస్ గా పృద్వి రాజ్

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్  లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ, “ఈ మూవీలో నటుడు పృద్వి రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్ర సినిమాకు హైలెట్ కానుంది. ఈ సందర్భంగా పృద్వి లుక్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఈ మూవీ నుండి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. సినిమా బాగా వస్తోంది.” డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ మూవీ ఆడియన్స్ ను అలరించబోతోందని తెలిపారు..

Related Articles

Back to top button
Send this to a friend