ఇండస్ట్రీని పట్టించుకోని శేఖర్ కమ్ముల 

సెన్సిబుల్ డైరక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎవరేమనుకున్నా తన పంథాలోనే సినిమాలు చేస్తాడు. సినిమా పరిశ్రమ వ్యక్తులతో కూడా పెద్దగా కలవడు. రెగ్యులర్ మూవీ లవర్స్ టైప్ కూడా కాదు. షూటింగ్ ఉంటే ఓకే. లేదంటే ఇంటికే పరిమితం అవుతాడు. తన ఆఫీస్ కూడా ఇంట్లోనే ఉండటం విశేషం. రెండేళ్ల క్రితం ఫిదాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైత్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’సినిమా తీస్తున్నాడు. ఇది అప్పర్ అండ్ పూర్ క్లాసెస్ మధ్య  జరిగే ప్రేమకథ. క్యాస్ట్ ఎపిసోడ్ కూడా ఉంటుదని చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో సినిమా పరిశ్రమ అన్ని షూటింగ్ లు నిలిపేయాలని పిలుపునిచ్చింది. చివరికి టివి, వెబ్ సిరీష్ షూటింగ్ లు కూడా నిలిపేశారు. ఈ విషయంపై ఆయా పరిశ్రమలు ఓ ఖచ్చితమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నాయి. కానీ శేఖర్ కమ్ముల మాత్రం ఆ నిర్ణయాన్ని పాటించడం లేదు. కరోనానా.. డోంట్ కేర్ అన్నట్టుగా తన లవ్ స్టోరీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్ నగర్ ప్రాంతంలో జరుగుతోంది. పైగా ప్రధాన తారాగణం కూడా పాల్గొంటుందిట. అయితే చిత్రీకరణలో భాగంగా కరోనా ఎఫెక్ట్ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది టీమ్. కానీ ఓ వైపు దేశమంతా హై అలెర్ట్ ప్రకటిస్తే శేఖర్ కమ్ముల ఇలా చేయడం మాత్రం బాలేదంటున్నారు కొందరు. ఏదేమైనా శేఖర్ త్వరగా ఈ షూటింగ్ ఫుల్ స్టాప్ పెడితే ఆ టీమ్ కు చాలామంచిది.. కరోనా పరంగా.

Related Articles

Back to top button
Send this to a friend