ఆ జీవి మీద సినిమా తీస్తా అంటున్న ఆర్.జీ.వి

తన వివాదాస్పద సినిమాలతో నిత్యం వార్తల లో ఉండే వ్యక్తి సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ .తన మాటలు,సినిమా లే కాదు పాటలు కూడా అంతే ప్రత్యేకం అని ఇటీవల కరోనా పురుగు పాట తో ప్రూవ్ చేశాడు వర్మ.ఒక టివి ఇంటర్వ్యూ లో కరోనా గురించి అడిగిన ప్రశ్న కు వర్మ సమాధనంగా తాను 2,3 ఏళ్ల క్రితమే వైరస్ పై సినిమా తియ్యాలి అనుకున్నా అని తెలిపారు. తను కాలేజ్ చదివే రోజుల లో, వైరస్ ల వల్ల ప్రపంచం ఏ రకంగా నాశనం కాబోతుంది అనే దానిపై చదివిన ఓ పుస్తకం తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పాడు. గతంలో వచ్చిన ఎబోలా కంటే ఈ కరోనా ప్రమాదకరమైనది కాదని అన్నాడు. కాబట్టి నిజంగా వైరస్ మీద సినిమా తీసినా ఆశ్చర్య పడక్కర్లేదు.ఎందుకంటే అతను వర్మ కాబట్టి. వివాదం, వినోదం, విషాదం, వైరస్ కాదేది సినిమా కి అనర్హం అని నమ్మే వ్యక్తి వర్మ కాబట్టి…ఏమంటారు??

Related Articles

Back to top button
Send this to a friend