ఆసక్తిగా నాని, వివేక్ ల మైత్రి బంధం..

నేచురల్ స్టార్ గా తనదైన శైలిలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. మధ్యలో కొందరు వచ్చి ఎంత హడావిడీ చేసినా టాప్ లీగ్ తర్వాత ఉన్న లీగ్ కు తనే గ్యాంగ్ లీడర్ అనేది నిజం. అంటే నెక్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ నానిదే. అది మారదు అనేలా అతని నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేసి ఉన్నాడు నాని. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు తనతో నిన్నుకోరి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన శివ నిర్వాణతోనూ ‘టక్ జగదీష్’అనే సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీంతో పాటు రాహుల్ సాంకృత్యన్ తో ‘శ్యామ్ సింగరాయ’ కూడా లైన్ లో ఉంది. ఇక ఈ రెండు సినిమాలే కాక లేటెస్ట్ గా మరోటి అనౌన్స్ అయింది.
తను చేసిన రెండు సినిమాలతో సెన్సిబుల్ అనిపించుకున్నాడు. వైవిధ్యమైన కథ, కథనాలతో అలరించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని మరో సినిమా అనౌన్స్ చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమా కోసం నానికి సరిపోయే కథతోనే దర్శకుడు అప్రోచ్ అయ్యాడట. అది అతనికి నచ్చడంతో బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడు. స్క్రిప్టింగ్ లో తన సినిమాలకే కాక ఇతర సినిమాలకూ హెల్పించే చేసే వివేక్ కు ఆపని చాలా సులువు అని ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఏదేమైనా నాని రోపింగ్ మాత్రం టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్నా.. ఇలా మరోసారి తనకే సొంతమైన శైలిలో దర్శకులు, కథలను ఎంచుకుంటున్నాడు. సో.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవబోతున్నాడన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend