ఆలోచించండి : చంద్ర బోస్

సమాజంలో ప్రతి ఒక్కరూ కరోనా పై పోరు లో తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు.వైద్యులు పోలీసులు ఐతే మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటూ నిరంతరం విధులలో ఉంటున్నారు.ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల పైన కూడా దాడులు చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ నేపథ్యం లో ప్రజలకు అవగాహన కల్పించాలని సైబరాబాద్ సి.పి.సజ్జనార్, ప్రముఖ గేయ రచయిత చంద్ర బోస్ చేత పాట రాయించారు.””ఆలోచించండి అన్నలారా-ఆవేశం మానుకోండి తమ్ములారా “‘అనే గీతాన్ని రాశారు చంద్ర బోస్. పోలీసులు పడుతున్న కష్టం తో పాటు విధి నిర్వహణ లో వారి పై జరుగుతున్న దాడులను వీడియో లో చూపించారు.సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ పేజ్ లో ఈ వీడియో ను పోస్ట్ చేశారు. దీనిపై చిరు కూడా స్పందించి”పాట ఆలోచింపజేసే విధంగా ఉందని పోలీసుల ను గౌరవించడం తో పాటు వారికి సహకరించాలని ప్రజలను కోరుతూ ” రీ ట్వీట్ చేశారు.

Related Articles

Back to top button
Send this to a friend