ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు విషయం ఇంకా తేల్చలేదు కాని, ఆర్టిసి ఉద్యోగులకు మాత్రం రిటైర్ మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబందించిన ఆదేశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారని సమాచారం.
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కొద్ది కాలం క్రితం ఆర్టిసి ఉద్యోగులతో సమావేశం అయిన కెసిఆర్ ఈ మేరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related Articles

Leave a Reply

Back to top button
Close