ఆర్ఆర్ఆర్ .. రామ్ చరణ్ కోసం కొత్త హీరోయిన్..?


ఆర్ఆర్ఆర్.. కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ తో చెప్పిన టైమ్ కు విడుదల కాలేక ఏకంగా ఆరు నెలలకు పైగా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాకు మొదటి నుంచీ హీరోయిన్ తో పెద్ద సమస్యలే ఉన్నాయి. అయినా మొదటగా ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది అలియా భట్. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి చివరగా తప్పుకున్నది కూడా తనే అనేది లేటెస్ట్ న్యూస్. రాజమౌళికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ హీరోయిన్ కు అవసరం లేదు కదా.. పైగా ఇప్పుడు తనకు ఈ ప్రాజెక్ట్ వల్ల కొత్తగా వచ్చే గుర్తింపు కూడా ఏం లేదు. పైగా హీరోయిన్ కు మరీ అంత గొప్ప ప్రాధాన్యం ఉన్న సినిమా కూడా కాదని తనకూ తెలుసు. అందుకే తను డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుందట. అందుకు కారణం పూర్తిగా రాజమౌళిపైనే వేసి మరీ తప్పుకుందంటున్నారు. అంటే ఆయనకు తనిచ్చిన డేట్స్ ను ఉపయోగించుకోలేదు. తర్వాత కూడా రెండుమూడుసార్లు అడ్జెస్ట్ చేసే ప్రయత్నం చేసినా జక్కన్నకు వచ్చిన రకరకాల ఇబ్బందుల వల్ల తన పార్ట్ షూట్ చేయలేదు. దీంతో విసిగిపోయిన తను ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు చెప్పిందట.
ఇక విషయం రాజమౌళికి కూడా తెలుసు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ కోసం హీరోయిన్ ను వెదుకుతున్నారట. చరణ్ కు హీరోయిన్ దొరకడం పెద్ద సమస్య కాదు కానీ.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు సరిపోయేంత స్టేచర్ ఉన్న నటి ఎవరనేది ఇంపార్టెంట్. అలా చూస్తే రాజమౌళికి మరోసారి కొత్త చిక్కులు వచ్చిన పడుతున్నట్టే. మొత్తంగా తను రీసెంట్ గా చెప్పినట్టుగా ఈ మూవీ నుంచి ఆ ఇద్దరు హీరోలు మే నెలలో కూడా రిలీవ్ కావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. మరీ ఈ రేంజ్ లో చెక్కుతూ వెళితే ఎట్టా జక్కన్నా..?

Related Articles

Back to top button
Send this to a friend