ఆర్ఆర్ఆర్ డేట్ లో వస్తోన్న వరుణ్

వరుణ్ తేజ్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోన్న కుర్రాడు. రీసెంట్ గా గద్దలకొండ గణేష్ అంటూ మరో హిట్ అందుకున్న వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా మొదలుపెట్టాడు. ఇవాళ అఫీషియల్ గా ప్రారంభం అయిన ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ నిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం. అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తాడు. తమన్ సంగీత అందిస్తుండగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటాడు.ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే పర్ఫెక్ట్ గా ట్రెయిన్ అయ్యాడు వరుణ్ తేజ్. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ దబాంగ్ -3తో పరిచయం అయిన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా తెలుగులో ఎంటర్ కాబోతోంది. మొత్తంగా బాక్సింగ్ గేమ్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం ఇవాళ వైజాగ్ లో ప్రారంభం అయింది. కంటిన్యూస్ షూటింగ్ తో అతి తక్కువ టైమ్ లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తోన్నఈ మూవీని ఈ యేడాది జూలై 30న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఆ రోజున ఆర్ఆర్ఆర్ రావాల్సి ఉంది. కానీ అది పోస్ట్ పోన్ కావడంతో ఆ క్రేజీ డేట్ ను వరుణ్ కోసం లాక్ చేశారు.

Related Articles

Back to top button
Send this to a friend