అసలేం జరిగింది సినిమా జ్యూక్ బాక్స్

ఎక్సోడస్ మీడియా సంస్థ నిర్మించిన అసలేం జరిగింది సినిమా జ్యూక్ బాక్స్ ను ఆదిత్యా మ్యూజిక్ మంగళవారం విడుదల చేసింది. విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, భార్గవి పిళ్లై, మాళవిక, రాంకీ తదితరులు ఆలపించిన పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర నిర్మాత కె.నీలిమా తెలిపారు. విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవికలు ఆలపించిన పాటలు మెలోడియస్గా
ఉన్నాయని, విజయ్ ఏసుదాస్ చాలా రోజుల తర్వాత తెలుగులో పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ ప్రతిఒక్కర్ని ఆకట్టుకుంటుందన్నారు. తెలంగాణలో చిత్రీకరించిన ఈ సినిమా పాటల్ని తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాకు మహావీర్ మ్యూజిక్ అందించారు. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, చిర్రావూరి విజయ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాటల్ని రచించారు. దర్శకత్వ బాధ్యతల్ని ఎన్ వీ ఆర్ చేపట్టారు.

 

 

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami