అల్లు అర్జున్ ను హడలగొట్టిన కేరళ..!


అల వైకుంఠపురములో సినిమా తర్వాత సుకుమార్ తో కమిట్ అయ్యాడు. ఎర్రంచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా కోసం బన్నీ మేకోవర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అతను ఎర్రచందనం దొంగగా ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతిబాబు విలన్ గా నటిస్తోన్న ఈ మూవీలో తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపిస్తాడు. రష్మిక మందన్న హీరోయిన్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ కోసం అనుకున్న ఓ షెడ్యూల్ ఇప్పుడు వాయిదా పడింది. అది కూడా కేరళ షెడ్యూల్.
కేరళలోని భారీ అడవుల్లో సినిమా చిత్రీకరణ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ఇప్పుడు కేరళలో కరోనా కంగారు పెడుతోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ ఈ టీమ్ కూడా ఆ షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకుంది. అందుకు బదులుగా ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఏదేమైనా కరోనా అల్లు అర్జున్ ను కూడా హడలగొట్టిందన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend