అల్లు అర్జున్ కు విజయ్ విలన్ కాదా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములో భారీ హిట్ కావడంతో అంతకు మించిన జోష్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎర్రచందనం స్మగులింగ్ ముఠాల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కంప్లీట్ గా చిత్తూరు ప్రాంతంలో సాగే ఈ మూవీ కోసం ఆ జిల్లా యాసను కూడా నేర్చుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇందుకోసం ఒక ట్యూటర్ ను కూడా పెట్టుకున్నాడు. చాలా వరకూ ఈ కథ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఉంది. ఇలాంటి కథ ఇంతకు ముందు తెలుగులో రాలేదు అనే టాక్ ఉంది.
ఇక ఈ మూవీలో అర్జున్ కు విలన్ గా తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతిని దించారు అనే టాక్ వచ్చింది. కానీ విలన్ విజయ్ కాదట. ఎర్రచందనం దుంగలను తన లారీలో తరలించే తెలివైన డ్రైవర్ గా నటిస్తోన్న అల్లు అర్జున్ ను ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించే ఓ సిన్సియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రోలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అంటే ఈ ఇద్దరి మధ్యా దొంగా పోలీస్ ఆట నడుస్తుందన్నమాట.
ఇక ఈ మూవీలో విలన్స్ గా నటిస్తున్నది ఎవరో తెలుసా.. మన తెలుగు స్టార్ జగపతి బాబుతో పాటు కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిలు విలన్స్ ట. ఇద్దరూ చాలా స్టైలిష్ గా ఉంటారు. ఒక రకంగా చివర్లో ఈ ఇద్దరితో అర్జున్ అండ్ విజయ్ లు తలపడే ఛాన్స్ ఉంది. మొత్తంగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ ఫేవరెట్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సో.. విజయ్ సేతుపతి ఈ సారికి విలన్ కాదన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend