అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. అల వైకుంఠపురములో తర్వాత క్లౌడ్ నైన్టీనైన్ లో ఉన్నాడు. ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న భారీ హిట్ ఈ సినిమా ఇచ్చింది. ఇక ఈ ఉత్సాహంతోనే సుకుమార్ సినిమాకు వెళ్లబోతున్నాడు. రంగస్థలం వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సుకుమార్ కు చాలా గ్యాప్ వచ్చింది. అయినా ఓ మంచి కథతోనే మరోసారి రాబోతున్నాడట. ఈ సారి కూడా రంగస్థలం తరహాలో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ తోనే వస్తున్నట్టు సమాచారం. ఇక అందరూ అనుకున్నట్టు ఇందులో అల్లు అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్ కాదు. ఎర్రచందనం దొంగల ముఠాలో కీలక సభ్యుడు. తమ ‘వర్గం’వాళ్లంతా దొంగతనంగా దుంగలు తెస్తే వాటిని చెక్ పోస్ట్ లు దాటించే పని బన్నీదట.
ఈ లుక్ లో అల్లు అర్జున్ ఓ రేంజ్ మాస్ గా కనిపిస్తాడని టాక్. అంటే రంగస్థలంలో రామ్ చరణ్ తరహాలో ఊరమాస్ గా ఉంటాడట. స్లాంగ్ కూడా చిత్తూరుదే వాడుతున్నాడు. అందుకోసం ఓ ట్యూటర్ ను కూడా పెట్టుకున్నాడు. ఇక ఈ సారి లారీ డ్రైవర్ అనగానే మనోడికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అభిమానులు కూడా తెగ సంబరంగా చెప్పుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో అతని తల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లోనే కాదు.. ఏ భాషలో అయినా ఏ స్టార్ హీరో సినిమాలో కూడా రాలేదని బలంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే అల్లు అర్జున్ మరోసారి కథకే స్టక్ ఆన్ అయి ఉండబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. అంటే.. మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend