అల్లు అరవింద్ తో చేతులు కలిపిన క్రిష్

క్రిష్.. దర్శకుడుగా సక్సెస్ .. కానీ కమర్షియల్ గా ఫెయిల్. అతని గురించి ఒక్క మాటలో చెబితే ఇంతే. యస్… అతని సినిమాలు విమర్శకులను కొందరు ప్రేక్షకులను మెప్పిస్తాయి. కానీ నిర్మాతలకు మాత్రం లాస్ లు తప్పవు. అయినా ఓ మంచి దర్శకుడుగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ గా చేసిన ఎన్టీఆర్ బయోపిక్స్ తో ఆ మంచి ట్యాగ్ కూడా పోయింది. దీనికి తోడు కంగనా రనౌత్ తో గొడవలో మనోడు భంగపడ్డాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ కంప్లీట్ కమర్షియల్ సినిమా చేస్తోన్న క్రిష్ మరోవైపు అల్లు అరవింద్ తో చేతులు కలిపాడు.
వెండితెరపై దర్శకుడుగా క్రిష్ ఎలా ఉన్నా బుల్లి తెరపై మనోడు సక్సెస్. అంటే ఈటివిలో స్వాతి చినుకులు అనే సీరియల్ నిర్మించి సక్సెస్ అయ్యాడు. అలాగే మరికొన్ని సీరియల్స్ లోనూ అతని నిర్మాణం ఉంది. ఈ నేపథ్యంలో తన ప్రొడక్షన్ స్కిల్స్ ను విస్తరించుకుంటూ అల్లు అరవింద్ తో కలిసి నిర్మాణం చేయబోతున్నాడు. అంటే అల్లు అరవింద్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’లో వెబ్ సిరీస్ లు కూడా ఇందులో ఉంటాయట. అలాగే కొన్ని చిన్న సినిమాల నిర్మాణంలో గీతా ఆర్ట్స్ లోనూ భాగస్వామిగా ఉంటాడు.
ఈ కాంబినేషన్ లో వచ్చే కథలు, స్క్రిప్ట్ లను క్రిష్ స్వయంగా పర్యవేక్షిస్తాడు. అతను ఓకే చేసిన తర్వాతే అవి అల్లు అరవింద్ వద్దకు వెళతాడు. అటుపై చిత్రీకరణకు నోచుకుంటాయి. ఇక ఈ కాంబోలో కొత్తవారికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్. సో.. మరి ఈ డీల్ తో క్రిష్ నిర్మాతగా సక్సెస్ అవబోతున్నాడా..?

Related Articles

Back to top button
Send this to a friend