అలీ ప్లేస్ లో సునిల్ ..

అలీ.. ఒకప్పుడు టాప్ కమెడియన్ గా వెలిగాడు. మొహమాటానికి టివి షోస్ ఒప్పుకుని వెండితెరకు దాదాపు దూరమయ్యాడు. ఇప్పుడు అలీని ఎవరూ పట్టించుకోవడం లేదు అనేది నిజం. ఏదో ఒకటీ అరా సినిమాలు చేసినా అతని మార్క్ అస్సలు కనిపించడం లేదు. పైగా మనోడి కామెడీ అంతా వేదికలకే పరిమితం కావడంతో ఇక అతని గ్రేస్ పోయిన్టటే అనుకోవచ్చు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో అలీకి మళ్లీ ఛాన్స్ ఇస్తాడు అనుకున్నారు. ఎందుకంటే అలీ తన గుండెకాయ అని చెప్పిన పవన్ పొలిటికల్ గా తేడాలు వచ్చాక ఇద్దరూ విడిపోయారు. బట్ సినిమాలు వేరు కదా.. అందుకే అలీని తీసుకుంటాడు అంటూ రూమర్స్ చేశారు. బట్ అలీ అందులో నిజం లేదని కొట్టిపడేశాడు.
అయితే అలీ లేని స్థానం సునిల్ ను వరించిందట. కొన్నాళ్లుగా మళ్లీ కమెడియన్ గా బిజీ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నాడు సునిల్. అందువల్ల ఇది అతనికి ఓ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈ ఛాన్స్ తో సునిల్ కమెడియన్ గా కమ్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి. అన్నట్టు ఈ పాత్ర క్రిష్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమా కోసం.

Related Articles

Back to top button
Send this to a friend