అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ గోవిందా అన్నట్టేనా..?
Arjun Reddy effect on Vijay Devarakonda!
అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా యూత్ లో హాట్ స్టార్ అయ్యాడు. దానికి తోడు అతని స్టేజ్ అప్పీరియన్స్, బిహేవియర్ అబ్ నార్మల్ గా ఉండటంతో ఒక వర్గం యువతను బాగా ఆకట్టుకున్నాడు. గీత గోవిందంతో కమర్షియల్ గానూ సత్తా చాటిన విజయ్ ఆ తర్వాత ఆ ఊపులో తనో పెద్ద స్టార్ ను అని ఫీలైపోయాడు. బట్ ఆ స్టార్డమ్ ఎక్కువ కాలం నిలవలేదు. గీత గోవిందం తర్వాత ఆ వేడిలో టాక్సీవాలా కమర్షియల్ గా ఫర్వాలేదనిపించుకున్నా… అటుపై చేసిన అన్ని సినిమాలూ తన్నేశాయి.
అర్జున్ రెడ్డి క్రేజ్ తో నోటా అంటూ తమిళ్ లోనూ అడుగుపెట్టాడు. ఆ సినిమా అక్కడ డిజాస్టర్ అయితే.. ఇక్కడ డిజాస్టర్ కా బాప్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య ఐదు భాషల్లో విడుదల చేసిన డియర్ కామ్రేడ్ ను కూడా జనం తిరస్కరించారు. ఈ టైమ్ లో జాగ్రత్త పడాల్సింది పోయి.. తనకోసం వచ్చిన సినిమాలో దర్శకుడి పనిలో వేలుపెట్టి లేటెస్ట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ను సైతం మైనస్ గా మార్చుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే అతనికి ఇప్పుడు అస్సలు క్రేజ్ లేదు అనేది తేలిపోయిందనేది ట్రేడ్ అనాలసిస్. నిజమే.. ముఫ్ఫై కోట్లకు అమ్మిన ఈ సినిమా నుంచి అతను సగం కూడా రాబట్టలేకపోయాడు. దీంతో నిర్మాత నిండా మునిగిపోయాడనే అంటున్నారు. మొత్తంగా అర్జున్ రెడ్డితో వచ్చిన గీతగోవిందం తెచ్చిన కమర్షియల్ స్టాండర్డ్ గోవిందా అన్నట్టే అని తేలిపోయింది. ఇక పూరీ జగన్నాథ్ ఫైటర్ ఏమౌతుందో చూస్తే అప్పుడు విజయ్ దేవరకొండ దారి ఎటు అనేది డిసైడ్ అవుతుంది.