అరణ్యంలో పడి విరాట పర్వం వదిలేసిన రానా

బాహుబలి తర్వాత వచ్చిన భారీ క్రేజ్ ను ఆ వెంటనే నేనే రాజు నేనే మంత్రి అంటూ క్యాష్ చేసుకున్నాడు రానా. ఆ దూకుడులో వరుసగా ఐదారు సినిమాలు కమిట్ అయ్యాడు. కానీ సడెన్ గా హెల్త్ పాడైంది. దీంతో నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ కారణంగా అన్ని సినిమాల డేట్స్ క్లాష్ అయ్యాయి. అయినా కోలుకుని షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు రానా. కాకపోతే మునుపటి గ్లో మాత్రం అతని ఫేస్ లో కనిపించడం లేదు. సరే పాత్రలను బట్టి మారుతూ ఉండొచ్చు అనుకుందాం.. ఇక రీసెంట్ గా అరణ్యం సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ భలే ఆకట్టుకుంటోంది. అలాగే ఆ మూవీ పాట కూడా మెప్పించింది. ప్రధానంగా తమిళ్ లో తర్వాత తెలుగు, హిందీలో విడుదల కాబోతోన్న చిత్రం. అందుకేనేమో.. ఈ మూవీ కోసం చిన్న దర్శకుడైనా వేణు ఊడుగులను ఇబ్బంది పెడుతున్నాడట రానా.
నీదీనాదీ ఒకే కథ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు వేణు ఊడుగుల. తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా తన కంటెంట్ ను నమ్మిన వారితోనే సినిమా చేస్తున్నాడు. అదే విరాట పర్వం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ మూవీ ఆ కోణంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్ అంటున్నారు. సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో  కనిపిస్తుంది. రానా పోలీస్ ఆఫీసర్. అయితే రానా ఈ మూవీకి చాలా చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి షూటింగ్ చేసినా ఇంకా అతని పార్ట్ చాలా బ్యాలన్స్ ఉండిపోయింది. ఒక్క షెడ్యూల్ టైమ్ కేటాయిస్తే సినిమా పూర్తవుతుందట. కానీ రానా మాత్రం వేణు ను లైట్ తీసుకుంటున్నట్టు టాక్. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా కాస్తా సమ్మర్ లో కూడా వచ్చే ఛాన్స్ ను కోల్పోతోంది. ఏదేమైనా పెద్ద సినిమా కోసం తనకు నచ్చి ఒప్పుకున్న మరో సినిమాను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో..

Related Articles

Back to top button
Send this to a friend