అనుష్క ఆ బయోపిక్ లో యాక్ట్ చేస్తుందా..?

అనుష్క .. టాలీవుడ్ టాప్ లేపిన బ్యూటీ. ప్రస్తుతం కొత్త భామల మధ్య తను పోటీ పడలేదు. అంటే రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం కష్టం. అందుకే సోలోగానే ట్రై చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు నిశ్శబ్ధం అనే సినిమాతో రాబోతోంది. థియేటర్స్ బంద్ ఆగిపోతే ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతుంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసినఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత తను ఏ ప్రాజెక్ట్ చేస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు కానీ రకరకాల వార్తలు మాత్రం వస్తున్నాయి. రీసెంట్ గా తను గతంలో రారా కృష్ణయ్య అనే సినిమా చేసిన మహేష్ అనే దర్శకుడితో చేయబోతోందని వినిపిచింది. అలాగే తమిళ్ టాప్ డైరక్టర్ గౌతమ్ మీనన్ తోనూఓ సినిమా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి.
ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో సౌత్ లో తనకంటూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న సీనియర్ డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావు త్వరలోనే ఓ బయోపిక్ చేయబోతున్నాడు అంటున్నారు. ఆ బయోపిక్ లో అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఇదేమంత క్రేజీ బయోపిక్ కాదు. ప్రముఖ కర్నాటిక్ సింగర్, సోషల్ వర్కర్ బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ ను సింగీతం తీయబోతున్నారనే వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. నాగరత్నమ్మ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఫేమస్. అంటే ఓ రకంగా ఇది పీరియాడిక్ మూవీ కూడా. ఈ పాత్రలో అనుష్కను తీసుకోవాలనేది సింగీతం ఆలోచనట. అయితే తనకు ఇంకా కథ చెప్పలేదని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రంతో సింగీతం కూడా మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆయన వయసు ఇప్పటికే 88యేళ్లు. మరి ఈ వయసులో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాడా అనే డౌట్స్ అక్కర్లేదు. కాకపోతే అనుష్క చేస్తుందా అనేదే అనుమానం.

Related Articles

Back to top button
Send this to a friend