అదిరింది యాంకర్ అందంగా లేదనేనా..?

అదిరింది.. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతోన్న కామెడీ షో. జబర్దస్త్ నుంచి విడిపోయిన వాళ్లంతా కలిపి పెట్టిన వేరు కుంపటి ఈ షో. జబర్దస్త్ నుంచి ఏ మాత్రం కొత్తగా లేకపోయినా కొంత వరకూ ఫర్వాలేదనిపించుకుంటోందీ షో. ఇక ప్రధానంగా నాగాబాబు జడ్జ్ గా వచ్చాడు కాబట్టి బొమ్మ హిట్ అవుతుంది అనుకున్నా కాలేదనే చెప్పాలి. అలాగని ఫ్లాపూ కాదు. ఇక నాగబాబుతో పాటుగా జబర్దస్త్ లో స్టార్ కంటెంస్టెంట్ అయిన ఛమ్మక్ చంద్రతో పాటు ఆర్పీ కూడా వచ్చాడు. వీరితో పాటు జబర్దస్త్ తొలినాళ్ల కమెడియన్స్ అయిన ధన్ రాజ్, వేణులను కూడా తీసుకువచ్చారు. మొత్తంగా సాధారణ స్థాయిలో సాగుతోన్న ఈ షోలో యాంకర్ సమీర మొదట్లో మైనస్ అని చెప్పుకున్నారు.
అయిన దానికీ కానిదానికీ నవ్వుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది సమీర. అయితే ఆల్రెడీ జబర్దస్త్ లో ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చూసిన జనాలకు సమీరా పద్ధతిగా ఉండటం నచ్చలేదు. దీంతో యూ ట్యూబ్ కమెంట్స్ లో తనపై నెగెటివ్ గా రాశారు. మరి ఏమనుకున్నారో కానీ తనను తీసేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ భామ భాను శ్రీ తో పాటు యాంకర్ రవిలను తీసుకున్నారు. ఇక ఈ విషయంపై చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. దీంతో అనవసర గోల ఎందుకు అనుకుందేమో.. సమీర తనను తప్పించడంపై రియాక్ట్ అయింది.
ఓ సోషల్ మీడియాలో సమీర పోస్ట్ చేసింది. ‘తను ఆ షోకు 26ఎపిసోడ్స్ కు కాంటాక్ట్ పై సైన్ చేశానని చెప్పింది. కానీ పది ఎపిసోడ్స్ కే తొలగించారు. తనకంటే అందమైన అమ్మాయి కావాలనుకున్నారేమో అందుకే కొత్తవారిని తీసుకున్నారు. అలాగే నేను ప్రెగ్నెంట్ అని వస్తోన్న వార్తల్లో నిజం లేదంది. మరోవైపు తనను తొలిగిస్తోన్న విషయాన్ని కనీసంగా కూడా తనకు చెప్పలేదని.. డైరెక్టర్స్ కూడా స్పందించలేదని ఆరోపించింది. ఇదే టైమ్ లో కొత్తగా వచ్చిన వారికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది.. మొత్తంగా తన కంటే అందంగా ఉన్నవారు అనడంలోనే ఆమె భానుపై సెటైర్ వేసిందని అర్థం చేసుకోవచ్చు.
విశేషం ఏంటంటే.. ఇప్పుడు యూట్యూబ్ లో ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలామంది ‘భాను వస్తుందనుకుంటే సమీరను వద్దనే వాళ్లం కాదు’అంటూ కమెంట్స్ పెడుతుండటం..

Related Articles

Back to top button
Send this to a friend